హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని బడుల్లో ప్రతి రోజు 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 12 నుంచి బడులు ప్రారంభంకానున్న నేపథ్యంలో 2025-26 విద్యాసంవత్సరం అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం విడుదలచేశారు. ఈ ఏడాదిలో బడులకు 230 పనిదినాలుగా ఖరారుచేశారు. పదో తరగతి సిలబస్‌ను 2026 జనవరి 10లోగా, 1- 9 తరగతుల సిలబస్‌ను ఫిబ్రవరి 28 లోగా పూర్తిచేయాలని గడువు విధించారు. ప్రతి రోజు 5 నిమిషాలు యోగా, ధ్యానం చేయించాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి రోజు 30 నిమిషాలు విద్యార్థుల చేత చదివించాలని అకాడమిక్ క్యాలెండర్లో స్పష్టంచేశారు.