హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లల్లోని పోస్టులను మరో స్కూల్కు తరలించేందుకు విద్యాశాఖ అనుమతి చ్చింది. ఇలా 870 పోస్టులను తరలించనున్నారు. వీటిలో ఎక్కువగా భాషాపండితులు, ఎస్జీటీ పోస్టులున్నట్టు తెలిసింది. ఇది వరకు మిగులు టీచర్లను సర్దుబాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పోస్టులనే మరో స్కూల్కు తరలించారు.
ఇటీవలీ ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్లుగా, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్చేశారు. కొన్ని స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య పెరగగా, మరికొన్ని స్కూళ్లల్లో ఎన్రోల్మెంట్ తగ్గింది. అయితే గతంలో పోస్టులను అలాగే ఉంచి టీచర్లను మాత్రమే తాత్కాలికంగా సర్దుబాటు చేసేవారు. కానీ ఇప్పుడు పోస్టులనే తరలించేందుకు అనుమతిచ్చారు.