హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని పలువురు హవా లా వ్యాపారుల ఇండ్లు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారు లు గురువారం దాడులు చేశారు. గతంలో విదేశీ సిగరెట్ల స్మగ్లింగ్, ఫారిన్ కరెన్సీ, గుటా దందా ముసుగులో సాగుతున్న హవాలాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్నుంచీ నిఘా పెట్టిన ఈడీ అధికారులు.. మలక్పేట్, బేగంబజార్, సికింద్రాబాద్లోని 13 మందికి చెందిన వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈ దాడుల్లో భారీగా నగదు గుర్తించినట్టు తెలిసింది.