హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : గొర్రెల పంపిణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు గొర్రెల పెంపకం రైతులకు నోటీసులు ఇచ్చింది.
ఈ కేసులో మొదట వాంగ్మూలం ఇచ్చి, ఎఫ్ఐఆర్ చేయించిన రైతులతోపా టు.. ప్రభుత్వానికి గొర్రె పిల్లలు విక్రయించిన రైతులకు సైతం తాఖీదులు పంపింది. ఈనెల 15న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. ఈ కేసులో బాధిత రైతులను సాక్షులుగా చేర్చి, వారి వాంగ్మూలం ఈడీ రికార్డు చేయనున్నది.