Vote for Note Case | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెండు నెలల సమయం కావాలన్న నిందితుల విజ్ఞప్తిని నాంపల్లి ఈడీ కోర్టు జడ్జి రమేశ్ తిరస్కరించారు. తదుపరి విచారణ జరుగనున్న జనవరి 10న సీఎం రేవంత్‌రెడ్డి సహా నిందితులందరూ కోర్టుకు హాజరుకావాలని హె చ్చరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాంపల్లి ఈడీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసులో సోమవారం వాదనలు ముగిశాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సింహా (ఏ2), జెరూసలేం మత్తయ్య (ఎ4), సండ్ర వెంకటవీరయ్య (ఎ7) మాత్రమే కోర్టుకు హా జరయ్యారు.
మిగతావారి తరఫున న్యాయవాదులు గైర్హాజరీ పిటిషన్లు దా ఖలు చేశారు. వేంనరేందర్‌రెడ్డి కుమారుడు వేంకీర్తన్రెడ్డి పేరును కేసులోనుంచి తొలగించాలని ఇటీవల దాఖ లు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈడీ న్యాయస్థా నం విచారణ ప్రారంభించాలని జెరుసలేం మత్తయ్య తరఫు న్యాయవాది జడ్జిని కోరారు. తమకు మరికొంత సమయం కావాలని వేం నరేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు కోరగా కోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టులో క్వాష్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు స మయం కావాలని కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది.