హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : భూదాన్ భూముల కుంభకోణంలో బంజారాహిల్స్‌కు చెందిన ఖాదర్ ఉన్నీసా, మహమ్మద్ మునావర్ఖాన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితుల పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేశారు.
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మెడికల్‌లో పీజీ చేసిన వారు తప్పనిసరిగా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సేవలందించాలన్న నిబంధన అమలుకు గడువు విధించరాదని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ శ్రీనివాసరావు బుధవారం విచారణ చేపట్టి వివరణ కోరుతూ తదుపరి విచారణను 27కు వాయిదా వేశారు.