హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సీఎంతో ఆర్థికవేత్త కార్తిక్మురళీధరన్ గురువారం అసెంబ్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 0-10 ఏండ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం, విద్యాభ్యసన స్థాయి సామ ర్థ్య లోపాలకు సంబంధించి పలు నివేదికలను మురళీధరన్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆయా అంశాలపై ఇప్పటికే శ్రద్ధ పెట్టినట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డితో సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందం భేటీ అయ్యింది. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిని రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ భేటీలో సమాలోచనలు జరిగినట్టు తెలిపారు.