పెద్దపెల్లి : రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలంలో మహిళలు ప్రభుత్వం అందించిన చేయూతతో కుట్టు మిషన్ షాప్ నిర్వహిస్తున్న మహిళలను మంత్రి అభినందించారు. సాయి మిత్ర మహిళ సంఘం షాప్ నిర్వహణకు సహకరించిన మంత్రి కొప్పులను శుక్రవారం కరీంనగర్లోని క్యాంప్ కార్యాలయంలో మహిళలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా షాప్ రిజిస్ట్రేషన్ దస్తావేజులను మహిళలకు అందజేసి మంత్రి మాట్లాడారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వారు స్వతహాగా అభివృద్ధి లోకి రావడానికి తెలంగాణ ప్రభుత్వం కుట్టు మిషన్ ద్వారా శిక్షణ ఇచ్చి ఆదుకుంటుందని అన్నారు. మారుమూల ప్రాంతాల మహిళలు కూడా అభివృద్ధిలోకి వచ్చి కుటుంబ పోషణలో తమ వంతు పాత్ర పోషించాలనేది కేసీఆర్ ఉద్దేశమని మంత్రి తెలిపారు. సాయి మిత్ర కుట్టు మిషన్ గ్రూప్ అధ్యక్షురాలు దేవి రేణుక రాజేందర్, ఉప సర్పంచ్ ఆవుల లత, ఉప అధ్యక్షురాలు బచ్చాలి వసంత, ప్రధాన కార్యదర్శి సుంచుస్వప్న తదితరులు పాల్గొన్నారు.