హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో (Jubilee Hills Bypoll) నాన్ లోకల్ నాయకులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూత్‌కు రావడంపై సీరియస్ అయింది. ఓటర్లను ప్రభావితం చేసేలా తిరుగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
స్థానికేతరులైన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు నియోజకవర్గంలో యధేచ్చగా తిరుగుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అక్రమాలకు తెరతీశారు. రహమత్‌నగర్ డివిజన్ ఎస్డీపీ హోటల్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్ చేశారు. మరో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పెత్తనం చలాయించారు. వెంగళరావునగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త మట్టా దయానంద్ ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.. రహమత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో మాట్లాడారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
రూల్స్ అతిక్రమిస్తున్న కాంగ్రెస్ నేతలు.. పట్టించుకొని అధికారులు
రహమత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్న బీర్ల ఐలయ్య
ఓటు లేని వ్యక్తులు పోలింగ్… pic.twitter.com/nC79w8J6Xe
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ హల్చల్
ఓటర్లను మభ్య పెడుతూ, కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ బూత్ వద్ద తిరుగుతున్న రామచందర్ నాయక్ https://t.co/XFzxXoHVEY pic.twitter.com/60TqtVhLEI
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025
యదేచ్చగా పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ ఓటర్లను మభ్య పెడుతున్న స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
రహమత్ నగర్ డివిజన్ SDP హోటల్ వద్ద ఎమ్మెల్సీ శంకర్ తన అనుచరులతో హల్చల్
పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పెత్తనం
మాకు అధికారం ఉంది.. మేము ఉండవచ్చు… https://t.co/akKudz3cxV pic.twitter.com/oH5x7FKohe
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025