గద్వాల/అయిజ, మే 30 : ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కుల రాగా.. అవుట్‌ఫ్లో 38,824 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 అడుగులు ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.627 మేర నీరు నిల్వ ఉన్నది. సాయంత్రం వరద తగ్గుముఖం పట్టడంతో ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేయగా.. రాత్రి 10 గంటల ప్రాంతంలో గేట్లు మూసివేశారు.
కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 14,400 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 153 క్యూసెక్కులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. డ్యాం గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులు కాగా ప్రస్తుతం 1592.96 అడుగులకు చేరింది.ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 7,952 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 7,952 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రస్తుతం ఆనకట్టలో 8.9 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.