e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు

ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు

ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు
  • పార్టీ మారేవాళ్లతో టీఆర్‌ఎస్‌కు నష్టంలేదు
  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌

కమలాపూర్‌, జూన్‌ 2: నోరుతెరిస్తే ఆత్మగౌరవం అంటు న్న ఈటల రాజేందర్‌.. ఆయన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఎద్దేవాచేశారు. బుధవారం హన్మకొండలో కమలాపూర్‌ మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఈటల రాజేందర్‌ను ఆరుసార్లు ఎమ్మెల్యేను చేసి మూడుసార్లు మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీలు మారే వాళ్ల తో టీఆర్‌ఎస్‌కు నష్టం లేదన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, పార్టీ ఎజెండానే మనందరి ఎజెండా అని పేర్కొన్నారు. పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తామని వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సహకారంతో కమలాపూర్‌ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు. సమావేశంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, రాష్ట్ర రైతు విమోచన సంఘం చైర్మన్‌ నాగూర్ల వెంకటేశ్వర్‌రావు, మండల ఇన్‌చార్జి పేర్యాల రవీందర్‌రావు, ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు

ట్రెండింగ్‌

Advertisement