హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో కొత్తగా ఎర్త్సైన్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని మైనింగ్ కాలేజీని ఎర్త్సైన్స్ వర్సిటీగా అప్గ్రేడ్ చేయనున్నది. సంబంధించిన జీవో ఈ వారంలోనే విడుదలకానున్నది. వర్సిటీ ఏర్పాటుకు రూ. 500 కోట్లు, 100 పోస్టులు అవసరమని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ వర్సిటీలో మైనింగ్, ఎర్త్ సైన్స్, జియాలజీ, ఏఐ వంటి కోర్సులను ప్రవేశపెడతారు. దేశంలో ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో ఎర్త్సైన్స్ యూనివర్సిటీని నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం లో మైనింగ్ వర్సిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వచ్చినా ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ధన్బాద్లో మైనింగ్వర్సిటీ ఏర్పాటు చేసినా.. ఆ కోర్సులకు డిమాండ్ లేకపోవడంతో ఈ వర్సిటీని మూసివేసి, ఆ తర్వాత ఐఐటీగా అప్గ్రేడ్ చేశారు. మైనింగ్ వర్సిటీకి బదులు ఎర్త్సైన్స్ వర్సిటీని ఏర్పా టు చేయాలని నిర్ణయించింది.