హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఎర్త్ అవర్కు నేడు(శనివారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గంటపాటు లైట్లు ఆఫ్ చేయనున్నారు. సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాత్రి 8.30 గంటల నుంచి 9.30వరకు సచివాలయంలో లైట్లన్నీ ఆఫ్ చేస్తామని, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.