Monsoon | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది. అంచనా వేసిన సమయానికి కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయని తెలిపింది. ఏపీలోని నెల్లూరు కావాలి, తెలంగాణలోని మహబూబ్నగర్ వరకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. మరో రెండురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
సాధారణంగా జూన్ రెండోవారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ, ఈ చాలాముందస్తుగానే ప్రవేశించాయి. తెలంగాణలో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. గతవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదురోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణకేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో జారీ చేసింది.
Heavy Rains | తెలంగాణలో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!