హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ‘ఈగల్’ పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గోవా, గుజరాత్లో దాడులు నిర్వహించి 20 మంది డ్రగ్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ‘ఈగల్’ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య మంగళవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నించిన నైజీరియన్ ఓనియాసి ఎసోంచి కెన్నెత్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఏడాదిగా డ్రగ్స్ విక్రయాలతో రూ.68 లక్షలకుపైగా కమిషన్ ఆర్జించినట్టు తేలిందని వివరించారు. కెన్నెత్‌కు డ బ్బు పంపిన వారు భారీ హవాలా నెట్వర్ నడుపుతున్నారని, ఈ ముఠా గోవాలోని నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌తో వచ్చిన నగదు రోజుకు రూ.25 లక్షల చొప్పున హవాలా ఆపరేటర్లకు పంపిస్తున్నారని చెప్పారు.