హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి అదానీ విరాళంగా ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సరే.. మరి మిగతా ఒప్పందాల సంగతేంది రేవంత్‌రెడ్డీ?’ అని ఆయన ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. అదానీ అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని రాహుల్‌గాంధీ డిమాండ్ చేస్తున్న సమయంలో దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటని ప్రశ్నించారు. అదానీకి రాష్ట్రంలోని డిసంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు పన్నిన కుట్రల సంగతి కూడా బయటపెట్టాలని పేర్కొన్నారు. ‘20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. అవినీతిపరుడంటూ రాహుల్‌గాంధీ విమర్శించిన వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్‌కార్పెట్ పరిచిందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తున్న అదానీతోనే రేవంత్‌రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నారని, అదానీ అవినీతి బయటికిరాగానే సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని దుయ్యబట్టారు.
దివ్యాంగుల ప్రత్యేక కమిషనర్‌ను ఎందుకు నియమించలేదు ; ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 25, (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల చట్టం కింద ప్రత్యేక కమిషనర్ నియమాకం చేపట్టకపోవడంపై వివరణ ఇ వ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల హకుల చట్టం సెక్షన్ 70(1) కింద ప్రత్యేక కమిషనర్ ఏర్పాటు చేయకపోవడా న్ని సవాలు చేస్తూ ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బె్లైండ్, మరో సంస్థ వేసిన పిటిషన్లను జస్టిస్ సూరేపల్లి నంద సోమవారం విచారించారు. న్యాయవాది సాహితి శ్రీకావ్య వాదనలు వినిపిస్తూ ప్రత్యేక కమిషనర్‌ను నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. స్పందించిన హైకోర్టు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.