మహబూబ్‌నగర్ : దసరా నవరాత్రి ఉత్సవాలు మహబూబ్‌నగర్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల 7వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారం( Mahalaxmi Avatar ) లో భక్తులకు దర్శనమిచ్చారు. పాలమూరులోని బ్రాహ్మణ వాడి శ్రీ వాసవీ కన్యాకాపరమేశ్వరి ఆలయ నిర్వాహకులు అమ్మవారిని రూ. 7,77,77,777.77 కరెన్సీ నోట్లతో అలంకరించారు.
జిల్లా కేంద్రంలోనో రవీంద్రనగర్‌లో ఉన్న శీతలాదేవి ఆలయం, శ్రీనివాసకాలనీలోని వాసవిమాత ఆలయం, కుర్హునిశెట్టి కాలనీలోని తోట మైసమ్మ ఆలయం, నవాబ్‌పేట మండలం పర్వతాపురం మైసమ్మ దేవాలయం, కోయిలకొండ మండలం సూరారం, మూసాపేట మండలం నందిపేటలో అమ్మవారి ఉత్సవాలు వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు తీర్థ, ప్రసాదాలు భక్తులకు అందజేస్తున్నారు. పలు మంటపాల వద్ద చిన్నారుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.