MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్ అయినందువల్ల మూడు వారాలపాటు బెడ్‌రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. గాయం కారణంగా కొన్నిరోజులపాటు ఇంటికే పరిమితం కానున్నట్లు వెల్లడించారు. అయితే, ఏదైనా సమాచారం లేదా సహకారం కోసం తన కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
‘నా కాలికి ఫ్రాక్చర్ అయింది. అందువల్ల 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏదైనా సమాచారం లేదా సహకారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది’ అని కవిత ట్వీట్ చేశారు.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
మరోవైపు విషయం తెలుసుకున్న నెటిజన్లు, కార్యకర్తలు కవిత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘అక్కా.. మీరు త్వరగా కోలుకోవాలి’ అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరేమో ‘ఫ్రాక్చర్ ఎలా అయ్యింది’ అంటూ ఆరా తీస్తున్నారు.
Also Read..
Hyderabad | దారుణం.. దేవుడుచెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ
ChatGPT | ఆరోగ్యకరమైన అల్పాహారం ఏంటి..? చాట్ జీపీటీ సమాధానం ఇదీ..
India Corona | 24 గంటల వ్యవధిలో 5,676 కొత్త కేసులు.. 15 మరణాలు