ChatGPT | ఆరోగ్యకరమైన అల్పాహారం ఏంటి..? చాట్ జీపీటీ సమాధానం ఇదీ..
ChatGPT | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాట్ జీపీటీ’ (ChatGPT) హవా నడుస్తోంది. ఇది ఓ కొత్తతరం సెర్చ్ ఇంజిన్. ఈ టూల్‌తో మాట్లాడేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు ఆరోగ్యకరమైన అల్పాహారం (Healthy Breakfast) గురించి చాట్ జీపీటీని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.
ChatGPT | ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాట్ జీపీటీ’ (ChatGPT) హవా నడుస్తోంది. ఇది ఓ కొత్తతరం సెర్చ్ ఇంజిన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ టూల్ సాంకేతిక ప్రపంచంలోకి వచ్చీ రాగానే సంచలనాలు సృష్టిస్తోంది. అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టూల్‌తో మాట్లాడేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తమకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చాట్ జీపీటీ (ChatGPT)ని అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు ఆరోగ్యకరమైన అల్పాహారం (Healthy Breakfast) గురించి చాట్ జీపీటీని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. శరీరానికి శక్తిని అందించే పోషకాలు అధికంగా ఉండే ఆహారమే ఆరోగ్యకరమైన అల్పాహారం అని సమాధానం ఇచ్చింది. ఈ మేరకు ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం కొన్ని సూచనలు చేసింది.
తృణధాన్యాలతో (Whole grains) తయారు చేసిన రొట్టెలు లేదా ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్‌ని అల్పాహారంగా తీసుకోవాలని సూచించింది. ఇవి శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయని పేర్కొంది. అదేవిధంగా గుడ్లు, పెరుగు, చీజ్‌తో పాటు గింజలు/విత్తనాలు వంటి ప్రోటీన్ పదార్థాలను అల్పాహారంలో చేర్చుకోవాలని తెలిపింది.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కోసం వివిధ రకాల పండ్లు, కూరగాయలను అల్పాహారంలోకి చేర్చుకోవాలని సూచించింది. బెర్రీలు, అరటిపండ్లు, అవకాడో, బచ్చలికూర లేదా టమోటాలు బ్రేక్ ఫాస్ట్ మెనూలో చేర్చుకోవాలని తెలిపింది. వీటితోపాటు గింజలు, వెన్న వంటి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని పేర్కొంది.
ప్రతి రోజూ అల్పాహారం సమయంలో పాలు లేదా పాలపదార్థాలు ఉండేలా చూసుకోవాలని చాట్ జీపీటీ సూచించింది. మిల్క్ ప్రాడక్ట్స్‌ను ఇష్టపడని వారు నాన్ డైరీ పదార్థాలు బాదం పాలు, కొబ్బరి పాలు లేదా సోయా మిల్క్ తీసుకున్నా శరీరానికి మేలు కలుగుతుందని తెలిపింది. ఇక వేసవిలో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు అధిక మొత్తంలో నీరు, ఇతర పండ్ల రసాలు తాగాలని చాట్ జీపీటీ సూచించింది.
Also Read..
Health | ఆహారంలో ఉప్పు, చక్కెర తగ్గాల్సిందే.. జాతీయ పోషకాహార సంస్థ కొత్త మార్గదర్శకాలు
Salman Khan | సల్మాన్‌కు మరోసారి బెదిరింపు కాల్.. ఏప్రిల్ 30న చంపేస్తామంటూ..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

