హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రంలోని పంచాయతీలు ప్రగతిపథంలో సాగాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో నిధుల్లేక నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
సోమవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హయాంలో 19 పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కగా.. కాంగ్రెస్ హయాంలో ఒకటే ఒక అవార్డు వచ్చిందని విమర్శించారు.