హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. శిలాతోరణం వద్ద డ్రోన్ భక్తులకు కనిపించింది. భక్తుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు విదేశీయుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. డ్రోన్ ఎగురవేసిన భక్తుడు విదేశీయుడు కావడంతో ఆగమశాస్త్ర నిబంధనలు తెలియకపోవడంతోనే ఇలా చేసి ఉంటాడనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.