Driving Licence | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రవాణా శాఖ కల్పించింది. ఏ వాహనాన్ని నడపాలన్నా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి వయసు ఆధారంగా కొన్నేండ్ల గడువుతో జారీ చేస్తారు. గడువు ముగిసేలోగా లేదా ముగిసిన 30 రోజుల్లోగా లైసెన్స్‌ను రెన్యువల్ చేసుకోవాలి. లేకుంటే ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసి చాలా రోజులైతే జరిమానా చెల్లించడంతోపాటు మళ్లీ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి పరీక్షకు హాజరు కావాలి.