కడుపుమండి.. బతుకుబండిని కాల్చేసి!

- పెరిగిన డిజిల్ ధరలు, ఫైనాన్స్ వేధింపులు
- ఆవేదనతో రోడ్డుపైనే ఆటోను తగులబెట్టిన డ్రైవర్
సుబేదారి, ఆగస్టు 28: నిత్యం పెరుగుతు న్న డీజిల్ ధరలు ఓ వైపు.. కొవిడ్ కారణంగా బండిసరిగా నడువక ఫైనాన్స్ కిస్తీలు కట్టలేని పరిస్థితులు మరోవైపు.. తిండిపెడుతుందని కొనుగోలు చేసిన బతుకు ‘బండి’ని అదే పెట్రోల్ పోసి తగులబెట్టాడో వ్యక్తి. నిత్యం జనంతో రద్దీగా ఉండే హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. హనుమకొండ గుండ్లసింగారానికి చెందిన శ్రీనివాస్ ఫైనాన్స్ నుంచి ఆటో కొని నడిపించుకుంటున్నాడు. కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచడంతో డీజిల్ ధర ఆకాశాన్నంటింది. దీనికితోడు ఏడాన్నరగా కరోనా కారణంగా ఫైనాన్స్ కంపెనీకి డబ్బులు చెల్లించలేదు. కరోనా తగ్గుముఖం పడుతున్నా గిరాకీ లేక కుటుంబపోషణ భారమైంది. ఈ పరిస్థితులతో విసిగివేసారిన శ్రీనివాస్ శనివారం మధ్యాహ్నం నడిరోడ్డులో ఆటోపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పెరిగిన డీజిల్ ధర, ఫైనాన్స్ వేధింపులు ఎలా భరించాలంటూ వచ్చీపోయేవారికి తన బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచిందని కేంద్ర ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

