హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నియోజకవర్గంలో తీవ్ర తాగు నీటి కొరత ఏర్పడింది. ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగు నీరు లేకపోవడంతో స్థానికులు 3 నెలలుగా కష్టపడి బావి తవ్వుకున్నారు. అయినా బావిలో నీళ్లు రాలేదు. దీంతో పంచాయతీ అధికారులను వేడుకోగా కేవలం ఒక్కరోజు మాత్రమే గ్రామానికి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేశారని, మిగతా రోజులు మండల కేంద్రానికి వెళ్లి తామే నీళ్లు తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తాగు నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మంత్రి సీతక్క ఇలాకాలో తాగునీటి కరువు
ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్ గ్రామంలో తాగు నీరు లేక 3 నెలలుగా కష్టపడి బావి తవ్వుకున్న గ్రామస్తులు
బావిలో నీళ్లు రాకపోవడంతో, పంచాయతీ అధికారులను వేడుకోగా, కేవలం ఒక్కరోజు మాత్రమే గ్రామానికి ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేశారని, మిగతా… pic.twitter.com/GhWpEkKEkK
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2026