Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన డీఆర్డీవో మాజీ చైర్మన్
Green India Challenge | డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి సతీశ్ రెడ్డి ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని డాక్టర్ సైంటిస్ట్ హాస్టల్లో రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి సతీశ్ రెడ్డి మొక్కలు నాటారు.
Green India Challenge | హైదరాబాద్ : డీఆర్డీవో మాజీ చైర్మన్, రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి సతీశ్ రెడ్డి ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని డాక్టర్ సైంటిస్ట్ హాస్టల్లో రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి సతీశ్ రెడ్డి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జి సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో అన్నింటికంటే ప్రమాదకరమైనది కాలుష్యం అని తెలిపారు. మనిషి తన అవసరాల కోసం సృష్టించిన ప్లాస్టిక్ యావత్ భూమండలాన్ని కల్లోలం చేస్తున్నాయి. దీని నుంచి మనిషి బయటపడటానికి లక్షల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు.. కాలుష్యం సృష్టించిన విలయం వల్ల ప్రతి రెండు ఇళ్లలో ఒకరు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి దాపురించింది. కాలుష్యం అనేది ఒక్క గాలికి, నీరుకు సంబంధించిందో కాదు.. మన జీవిత ప్రయాణంలో ప్రతీ అంశంలో కాలుష్యం కల్లోలితం చేస్తుంది. అందుకే నేడు లక్షల బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ వేరే గ్రహాల్లో జీవన అవకాశాలు కోసం పరిశోధిస్తున్నాం. ఈ సమస్యలన్నింటికి ఏకైక పరిష్కారం మొక్కలు నాటడం. ఆ పని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సంతోష్ కుమార్ చేస్తున్న కృషిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములం కావల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సతీశ్ రెడ్డి అన్నారు.
ఆనంతరం రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ శాస్త్ర సాంకేతికరంగంలో భారత దేశం గర్వించే స్థానానికి చేరుకోవడంలో తనదైన పాత్ర పోషించిన సతీష్ రెడ్డి ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగం కావడం చాలా సంతోషం కలిగించిందన్నారు. వారి స్పూర్తివంతమైన మాటలు.. అనేక మందిని మొక్కలు నాటించే వైపుగా ఆలోచింపజేసేవిగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబర్స్ రాఘవ, కర్ణాకర్ రెడ్డి, ఇతర సైంటిస్టులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

