హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. 6న ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల ను విడుదల చేయాలని ఎస్ఈసీ ఎంపీడీవోలను ఆదేశించింది.
6 నుంచి 8 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో 8న మండలం, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని తెలిపిం ది. 9న అభ్యంతరాలు పరిష్కరించి, 10న తుది జాబితాలు ప్రదర్శించాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.