హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని కిమ్స్-ఉషాలక్ష్మీ సెంటర్ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పీ రఘురాం ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. శుక్రవారం సాయంత్రం మంగళూరులోని టీఎంఏపై ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్లాటినం జూబ్లీ కళాశాల దినోత్సవ వేడుకల సందర్భంగా మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎంఎహెచ్ఇ) ఫ్రొఫెసర్.చాన్స్లర్ హెచ్ఎస్ బల్లాల్ ఈ అవార్డును ఆయనకు అందజేశారు.
మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కళాశాల 70ఏండ్ల చరిత్రలో తొలిసారిగా ‘విశిష్ట పూర్వ విద్యార్థి’ అవార్డు పొందిన తొలి వైద్యుడిగా అరుదైన ఘనత సాధించారు. తనకు ఈ అవార్డు రావడం పట్ల డాక్టర్ రఘురాం హర్షం వ్యక్తంచేశారు.