హైదరాబాద్, జనవరి 28 (నమస్తేతెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ చాలా గొప్ప కార్యక్రమమని, మొక్కలను నాటడం దైవకార్యంతో సమానమని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మజారెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా శుక్రవారం ఆమె బేగంపేటలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. అనంతరం డాక్టర్ పద్మజారెడ్డి తన స్నేహితులు ప్రతిభ, వనజ, ఉమారాణికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.