వికారాబాద్, జనవరి 2 : తెలంగాణలో అసెంబ్లీ జరిగే పద్ధతి గందరగోళంగా ఉందని, స్పీకర్ వైఖరి బాగాలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ప్రతిపక్షాలకు మైకు ఇవ్వనని చెప్ప డం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అసెంబ్లీకి వచ్చేది ప్రజల పక్షాన పోరాడటానికి కానీ, ముఖ్యమంత్రిని పొగడటానికి కాదు అని స్పీకర్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షం గొం తు నొక్కడం అంటే ప్రజల గొంతు నొక్కటమే అని తెలిపారు. మూసీ ప్రక్షాళన కంటే ముం దు ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్‌తో ప్రక్షాళన చేయాలని సూచించారు. స్పీకర్ ఇప్పటికైనా అసెంబ్లీ రూల్స్ చదువుకొని, ప్రతిపక్షాల హక్కులను కాలరాయకుండా మెలగాలని కోరారు. ప్రతిపక్షానికి, అధికారపక్షానికి సమానంగా అవకాశాలు ఇవ్వాలని తెలిపారు.