హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారిగా డాక్టర్ సీ సువర్ణ బాధ్యతలు స్వీకరించారు. 1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన సువర్ణ ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేశారు. అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి ఆర్ఎం డోబ్రియాల్ బుధవారం పదవీ విరమణ చేశారు. ఆ యన స్థానంలో సువర్ణను అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారిగా ప్రభు త్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సువర్ణ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు.