SSC Exam Paper Leak | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): సాధారణంగా పరీక్షకు ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చి, దాన్ని చూసి సమాధానాలు సిద్ధం చేసుకొని పరీక్ష రాసే అవకాశం లభిస్తే దాన్ని పేపర్ లీకేజీగా భావిస్తారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 లాంటి పరీక్షల్లో కొంతవరకు ఈ పేపర్ లీకేజీ జరిగినట్టు దర్యాప్తు అధికారులే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరి ఎస్సెస్సీ పరీక్షల్లో ఏం జరుగుతున్నది? పరీక్ష మొదలైన తర్వాత కావాలని ప్రశ్నపత్రాలను ఫొటో తీసి వాట్సాప్లో చెలామణి చేస్తున్నట్టు తెలుగు, హిందీ పరీక్షల ఉదంతాల్లో స్పష్టమైంది.
దీనివల్ల క్వ శ్చన్ పేపర్ బయటకు వస్తుందే తప్ప.. సమాధానాలు పరీక్షాకేంద్రం లోపలికి వెళ్లేందుకు అవకాశమే లేదు. అయినా ఎందుకు చేస్తున్నా రు? 2 గంటల్లో ముగిసే పరీక్షకు సంబంధిం చి ప్రశ్నపత్రాన్ని బయటకు పంపిస్తే.. వెలుపల సమాధానాలు చూసేదెవరు? వాటిని తెచ్చి విద్యార్థికి అందించేదెవరు? అది ఎలా సాధ్యం? పైగా ఒక విద్యార్థికి సహాయం కోస మే అనుకుంటే.. సమాధానాలను ఆయనకు చేరవేయడమే పనిగా పెట్టుకుంటారు. కానీ, ప్రశ్నపత్రాలను వాట్సాప్లో ప్రచారం చేయడానికి ఎందుకు పూనుకుంటారు? వీటన్నింటికి ఒకే సమాధానం కనిపిస్తున్నది. కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే ఈ పేపర్లు బయటకు తెస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే సెల్ఫోన్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. విద్యార్థులు మొదలు ఇన్విజిలేటర్ల వర కు ఎవరి దగ్గరా సెల్ఫోన్లు ఉండకుండా చూ స్తున్నది. అయితే పరీక్షాకేంద్రం పక్కన ఉన్న చెట్ల పైకి బాలుడిని ఎక్కించి పనిగట్టుకొని ఫొటోలు తీయించినట్టు హన్మకొండ ఘటనతో స్పష్టమైంది. సాధారణంగా పిల్లలు భ యస్తులు. పోలీసులను చూస్తేనే జడుసుకొంటారు. అలాంటి పిల్లలు ఎవరైనా పరీక్షా కేంద్రానికి వెళ్లి, అక్కడి చెట్టుపైకి ఎక్కి, ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని, దాన్ని వాట్సాప్లో పోస్టు చేసేంత ధైర్యం చేస్తారా? ఎవరి తో డ్పాటు లేకుండా పిల్లలు అలా చేయలేరని చెప్తున్న ఉపాధ్యాయులు.. కావాలని చేయిస్తే తప్ప ఇది సాధ్యపడదని స్పష్టం చేస్తున్నారు.