కరీంనగర్ : నగరంలో జరిగిన కారు ప్రమాద ఘటన దురదృష్టకరం, మృతి చెందిన నలుగురి కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. నిన్న ఓ కారు రోడ్డుపై ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి స్పందించారు.
ప్రమాద ఘటన దురదృష్టకరమని, గతంలో ఎన్నోసార్లు ఫుట్ పాత్ లపై వ్యాపారాలు వద్దని చెప్పినా వినక పోవడంతో విలువైన ప్రాణాలు కోల్పోయామన్నారు.
వీధి వ్యాపారులు అధికారులు సూచించిన ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇల్లు, గాయపడిన వారికి రూ.50 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.