సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 18:13:10

ఎరుకల నాంచారమ్మ నగర్‌లో 'డబుల్'‌ ఇళ్లు పూర్తి

ఎరుకల నాంచారమ్మ నగర్‌లో 'డబుల్'‌ ఇళ్లు పూర్తి

హైదరాబాద్‌ : నగరంలోని ఎరుకల నాంచారమ్మ నగర్‌లో సకల వసతులతో కూడిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి పక్కా ఇళ్లు నిర్మించినట్లు చెప్పారు. రెండు బ్లాక్‌లుగా 9 అంతస్తులతో 288 ఇళ్లను నిర్మించినట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి భూమి అప్పగించిన వారికి 154 ఇళ్లు కేటాయించినట్లుగా తెలిపిన మేయర్‌ మిగిలిన ఇళ్లకు లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. మొత్తం నిర్మాణ వ్యయం రూ. 24 కోట్ల 91 లక్షల 20 వేలు అయిందన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.8.65 లక్షలు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు.


logo