DOST | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొన్నది. ఇంటర్ ఫలితాలు విడుదలై వారం రోజులు(ఈ నెల 22న) గడిచినా ఇంత వరకు దోస్త్ నోటిఫికేషన్ విడుదలకాలేదు.
‘దోస్త్’ విషయమై తెలంగాణ ఉన్నత విద్యామండలి, కొందరు అధికారుల మధ్య వార్ నడుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో నోటిఫికేషన్ ఆలస్యమవుతున్నట్టు సమాచారం. డిగ్రీ ప్రవేశాలు మరింత ఆలస్యంకానున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.