DOST | హైదరాబాద్ : డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందిన వారు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు పెంచారు. రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు కూడా గడువు పొడిగించారు. తొలి విడత సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జూన్ 12 నుంచి 15వ తేదీ వరకు, రెండో విడత రిజిస్ట్రేషన్ గడువును జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు పొడిగించారు. దోస్త్ ఫేజ్-2 వెబ్ ఆప్షన్ల నమోదు గడువు జూన్ 14 నుంచి 15కు పెంచారు.