నర్సింహులపేట, అక్టోబర్ 23: ఏపీ సీఎం చంద్రబాబు మంచి నాయకుడు, ఆయన ఆలోచనలతో ముందుకెళ్దామని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటో త్ రామచంద్రునాయక్ పేర్కొన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 73 ఏండ్ల వయసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం కుట్రలతో జైలుకు పంపినా ప్రజల ఆదరణతో సీఎం అయ్యారని పొగడ్తలతో ముంచెత్తారు. రాజకీయం కోసం పుట్టిన నేత చంద్రబాబు నాయుడని చెప్పారు. అంతా విన్న కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తున్నాడోనని గుసగుసలాడుకున్నారు.