సిర్పూర్(టీ), అక్టోబర్ 7 : గురుకులాల విద్యార్థుల జీవితాలతో రేవంత్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని, ఇది ఏమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజినీర్లను తయారుచేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాల మూతపడే ప్రమాదంలో ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని సాంఘి సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు.
సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాలలో చిన్న మరమ్మతులు చేయలేక తరలించాలనుకో వడం దారుణమని మండిపడ్డారు. అవసరమైతే విద్యార్థు ల తల్లిదండ్రులతో కలిసి మరమ్మతులు చేసుకొని కాపాడుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అస్లాంబిన్ అబ్దు ల్లా, పనాస లక్ష్మణ్, వర్మ, స్వామి పాల్గొన్నారు.