కామారెడ్డి, ఆగస్టు 23: కాంగ్రెస్ తెచ్చిన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. ఫ్రీ బస్ కారణంగా మహిళలు గొడవలు పడుతున్నారని, ఆ పథకాన్ని రద్దు చేయాలని శనివారం కామారెడ్డి బస్టాండ్లో ధర్నా చేశారు.
కొందరు మహిళలు అవసరం లేకున్నా బస్సులో ప్రయాణం చేస్తున్నారని, వివిధ అవసరాల కోసం వెళ్తున్న వారికి సీట్లు దొరకడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కండక్టర్లు, డ్రైవర్లు కూడా మహిళలను చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి సీఎం రేవంత్రెడ్డి రోడ్డున పడేశారని విమర్శించారు.