Transport department : తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. కొందరు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై ఉన్న టీఎస్ సిరీస్‌ను టీజీ సిరీస్‌గా మార్చుకుంటుండటంపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. టీఎస్ సీరిస్తో ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లను టీజీ సిరీస్‌లోకి మార్చవద్దని సూచించారు. అలా మార్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.
టీజీ సరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే ఆ కోడ్ వర్తిస్తుందని, అంతకుముందే కొన్న వాహనాలకు టీఎస్ సిరీస్ మాత్రమే ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. టీఎస్ సిరీస్ టీజీగా మారదని చెప్పారు. ఎవరైనా తమకుతామే నెంబర్ ప్లేట్‌పై ఉన్న స్టేట్ కోడ్‌ను మారిస్తే దాన్ని ట్యాంపరింగ్‌గా భావించి నేరంగా పరిగణిస్తామన్నారు. అలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.