హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికి రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్,సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): హైదరాబాద్-విజయవాడ(ఎన్‌హెచ్-65) జాతీయ రహదారి 8 వరుసల విస్తరణ పనులను వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్టు రా ష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈలోగా టెండర్ల ప్రక్రియ పూర్తికానున్నట్టు స్పష్టంచేశారు. ఈ రహదారిపై ఇప్పటికే 17 బ్లాక్‌స్పాట్స్ గుర్తించి ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు.