హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ మారెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినందున వంటగ్యాస్ ధరలు తగ్గించి, వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచడం దారుణమని విమర్శించారు. ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ పదేండ్లలో గ్యాస్ సిలిండర్ ధరలు 130.57 శాతం పెంచడంతోపాటు, సబ్సిడీని భారీగా తగ్గించారని విమర్శించారు. ధరల పెంపును ఉపసంహరించుకునేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.