హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించి శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నది. శనివారం విడుదల చేసిన నీట్-2025 ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో టాప్ ర్యాంకులతోపాటు మొత్తం ర్యాం కుల్లో అగ్రస్థానంలో నిలిచినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు.
శ్రీ చైతన్య విద్యార్థులు కవిష్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, దివ్య 5వ ర్యాంకు, మహ్మద్ సమీర్ 6వ ర్యాంకు, బీ ధీరజ్ కుమార్ 8వ ర్యాంకు, మంగరి వరుణ్ 10వ ర్యాంకు సాధించి సత్తా చా టినట్టు పేర్కొన్నారు. అలాగే ఆలిండియా టాప్ 10 లోపు ర్యాంకుల్లో 5 ర్యాంకులు వచ్చినట్టు తెలిపారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీల్లో 100లోపు అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులే సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. నీట్-2026కు ఏఐ టెక్నాలజీతో లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, సిబ్బందిని అభినందించారు.