హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గత ఐదేండ్లుగా దాదాపు 15 లక్షల మంది కుక్కకాట్లకు, 21 వేల మందికిపైగా పాముకాట్లకు గురైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. 2020 జూలై నుంచి 2025 వరకు 14,88,781 మంది కుక్కకాట్లకు గురయ్యారని, ఆ బాధితులకు విడతలవారీగా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని తెలిపింది. సమాచార హక్కు (ఆర్టీఐ చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వివరాలను తెలియజేసినట్టు యాత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి మీడియాకు వెల్లడించారు.