హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆరేనని తాము గర్వం గా చెప్పుకుంటున్నామని, కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ముందా? అని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సీఎం అభ్యర్థిని ప్రకటించాకే కాంగ్రెస్ డిక్లరేషన్, ఇతర అంశాలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు ఢిల్లీ నుంచి వస్తున్న ఏఐసీసీ, సీడబ్ల్యూసీ సభ్యుల్లో ఎక్కువ మంది అవినీతిపరులేనని పే ర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎండబెట్టిన ఆ పార్టీ ఇ ప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చి దోపిడీకి కుయుక్తులు పన్నుతున్నదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎత్తుగడలను రాష్ట్ర ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.