ముస్తాబాద్, జూన్ 15: తెలంగాణ సా యుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కుర్మ సామాజిక వర్గం ఏర్పాటుచేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిషరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ పోరాట యోధులకు తగిన గుర్తింపు ఇచ్చి వారి చరిత్రను ప్రజలకు తెలియజేశారని కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వం కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని, ఆయన వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం మారిందని అన్నారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, నాయకులు కల్వకుంట్ల గోపాల్‌రావు, చక్రధర్‌రెడ్డి, కొమ్ము బాలయ్య, బైతి నవీన్ తదితరులు పాల్గొన్నారు.