హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వైద్యుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బీ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూ ప్రసాద్ రాథో డ్, కోశాధికారి డాక్టర్ ఎంకే రౌఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్ మార్పు నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ నియామకాలు చేపట్టాలని కోరారు. జీవో 142ను సవరించడంతోపాటు, డెంటల్ డాకర్లకు ఉద్యోగోన్నతి కల్పిం చి, బోధనేతర వైద్యులకు కనీసం కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ రూపంలో కాలపరిమితితో కూడిన ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే రాబో యే కార్యవర్గ సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.