జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ప్రాణం పోయాల్సిన వైద్యులే పట్టనట్లుగా వ్యవహరించారు. బైడ్ పై నుంచి కిందపడి ఓ రోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా.. ఎంతమందిని పిలిచినా ఎవరు స్పందించలేదు. గంటకు పైగా భూమయ్య బెడ్ కిందే పడిపోయి నరకయాతన అనుభవించాడు.
నేను చచ్చిపోతున్న పట్టించుకోవాలని రోదించినా దవాఖాన సిబ్బందిలోని ఏ ఒక్కరి హృదయాన్ని కదిలించలేక పోయింది. ఆయన ఆర్తనాదం అరణ్య రోదనగానే మిగిలిపోయింది. కాగా, బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ దవాఖానులు నేడు పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం
గంటకు పైగా బెడ్ కిందే పడిపోయి ఉన్న రోగి భూమయ్య
నేను చచ్చిపోతున్న పట్టించుకోవాలని రోదించిన భూమయ్య
అయినా పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది pic.twitter.com/C1jxgqizKZ
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2025