సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 21:55:47

పెద్దపల్లి జడ్పీ కార్యాలయంలో వైద్యులకు సన్మానం

పెద్దపల్లి జడ్పీ కార్యాలయంలో వైద్యులకు సన్మానం

పెద్దపల్లి : కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు  కుటుంబ సభ్యులు కూడా నిరాకరిస్తున్నారు. దీంతో ఎంతోమంది అంత్యక్రియలకు దిక్కూమొక్కూ లేకుండా పోతోంది. ఈ నెల 13న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ఓ కరోనా రోగి మృతి చెందగా.. అంత్యక్రియలు నిర్వహించాల్సిన మున్సిపల్ సిబ్బంది అందుబాటులోకి రాలేదు.

దవాఖాన సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా వారి నుంచి స్పందన లేకపోవడంతో కరోనా నియంత్రణ కోసం నియమించిన జిల్లా ప్రత్యేక వైద్యాధికారి శ్రీరామ్ మానవీయ దృక్పథంతో మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ డాక్టర్ శ్రీరామ్‌తోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్లను అభినందించి ఘనంగా సన్మానించారు.
logo