హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో సమ్మె సైరన్ మోగింది. పలు డిమాండ్ల సాధన కోసం సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లతోపాటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు. ఈ నెల 19 నుంచి విధులు బహిష్కరించనున్నట్టు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్‌తోపాటు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
ఈ విషయమై శనివారం డీఎంఈ రమేశ్‌రెడ్డికి ఉభయ సంఘాలూ వేర్వేరుగా సమ్మె నోటీసులు ఇచ్చాయి. మూడు నెలలుగా తమకు ైస్టెపెండ్ రావడం లేదని, వారంలో 80-90 గంటలపాటు పేమెంట్ లేకుం డా పనిచేయాల్సి వస్తున్నదని, ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు డీఎంఈతోపాటు హెల్త్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీకి వినతిపత్రాలు సమర్పించామని అసోసియేషన్ల బాధ్యులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోనందున విధులు బహిష్కరించాలని నిర్ణయించినట్టు సమ్మె నోటీసుల్లో పేర్కొన్నారు.
ప్రతి నెలా ైస్టెపెండ్ చెల్లించేందు కు ఒక నిర్ణీత తేదీని ప్రకటించడం, మెడికల్ బిల్లులు క్లియర్ చేయడం తదితర వ్యవహారాలు చూసుకునేందుకు ఫైనా న్స్ విభాగంలో ఒక అధికారిని నియమించడం అనేవి తమ ప్రధాన డిమాం డ్లు అని వారు పేర్కొన్నారు. సమ్మె ప్రా రంభం సందర్భంగా మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలంగాణ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కౌశిక్‌కుమార్ తెలిపారు. ైస్టెపెండ్ నిధులను విడుదల చేయాలని ఇప్పటికే అనేక సార్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు.