హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిని ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నోరి దత్తాత్రేయుడు అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ దవాఖానలో క్యాన్సర్ విభాగానికి అధికారిగా పనిచేస్తున్నారు. వైద్యరంగంలో సంసరణలకు తన వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని సీఎంకు నోరి దత్తాత్రేయుడు తెలిపారు.